- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, మక్తల్: మక్తల్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆశా వర్కర్ ఆశమ్మ(35) తనకున్న అనారోగ్యంతో మానసిక వేదన చెంది ఆశమ్మ ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. మక్తల్ పట్టణంలో యాదవ నగర్‌లో నివాసం ఉంటున్న ఆశమ్మ ఆశావర్కర్‌గా పనిచేస్తు ఆర్థికంగా బాగోలేక ఎదిగిన పిల్లలకు చదువు పెళ్లీడుకొచ్చిన కూతురు, వైద్యపరీక్షలో తనకున్న రోగం బయట పడటం తన తోటి వర్కర్లు తనని దూరం పెట్టడం తను ఎక్కువ రోజులు బ్రతకను అన్న నిరాశతో గురువారం మధ్య రాత్రి బీమా ఫేజ్ వన్ కెనాల్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మక్తల్ పోలీసులు సంగం బండ రిజర్వాయర్ నింపేందుకు వదిలిన నీటిని బంద్ చేసి గాలింపు చేయగా శనివారం ఉదయం కాలువలో మృతదేహం బయటపడింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న ఆశమ్మకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నట్లు సమాచారం.






