- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి అధికారుల పోరుబాట.. హక్కుల కోసం రిలే నిరాహార దీక్షలు
సింగరేణి అధికారుల పోరుబాట పట్టారు. హక్కుల కోసం రిలే నిరాహార దీక్షలకు దిగారు.

దిశ, గోదావరిఖని: సింగరేణి అధికారుల పోరుబాట పట్టారు. హక్కుల కోసం రిలే నిరాహార దీక్షలకు దిగారు. కోల్ ఇండియా తరహా వేతన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని సింగరేణి అధికారులు డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని జిఎం ఆఫీస్ కార్యాలయం ముందు చేపట్టిన నిరాహార దీక్షలు సింగరేణి అధికారులు మాట్లాడారు. సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్జీ-1 ఏరియా అధికారులు రామగుండంలోని జీఎం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో నిరసన కొనసాగిస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి హక్కులను సాధించుకుంటామన్నారు. 2022-23, 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కోల్ ఇండియా అధికారులతో సమానంగా పే అప్‌గ్రేడేషన్, ఇతర అలవెన్సులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు దేశంలోని ఇతర బొగ్గు సంస్థల అధికారులతో సమాన స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ, వేతనాలు మరియు కొన్ని ఆర్థిక ప్రయోజనాల విషయంలో వ్యత్యాసం కొనసాగుతోందని ప్రతినిధులు పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న అధికారులకు న్యాయమైన ప్రయోజనాలు అందడం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా పీఆర్పీ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మా సమస్యలను పరిష్కరించే దిశగా యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరారు. సింగరేణి కార్మికులు, అధికారులు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సమస్యల పరిష్కారంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. హక్కుల సాధన కోసం శాంతియుత మార్గంలో నిరసన చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడం పై ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని, సంస్థకు ఆదాయం తీసుకువచ్చే అధికారులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం దీక్షలు చేయాల్సిన పరిస్థితి రావడం విచారకరం అని అధికారులు అన్నారు.
దీక్షలకు సంఘీభావం..
CMOAI RG-1 ఏరియా నాయకులు, వివిధ గనులకు చెందిన అధికారులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. డిమాండ్ల పరిష్కారం జరిగే వరకు దశలవారీగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. అధికారుల ఆందోళనపై సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు ఆర్ జీ 1 ప్రధాన కార్యదర్శి కోలా మల్లేష్, సి. శ్రీనివాస్ ఏజెంట్ జీడికే -11, సీఎంఓఏఐ అపెక్స్ ఉపాధ్యక్షులు, డా. రావుల దామోదర్ జాయింట్ సెక్రటరీ, సర్వే ఆఫీసర్, జీడికే 2&2A ఇంక్లైన్, ధీతి చంద్రమౌళి సీనియర్ సర్వే ఆఫీసర్, బి. కృష్ణ సీనియర్ అండర్ మేనేజర్, జీడికే -1 ఇంక్లైన్ తదితరులు పాల్గొన్నారు.






