- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవకన్యల మధ్య కామెడీ కింగ్.. అల్లరి నరేష్ 65వ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్
ఇందులో అల్లరి నరేష్ ఒక స్టైలిష్ అవతారంలో, స్వర్గలోకపు మెట్లపై కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన చేతిలో ఒక పెన్ను, అలాగే రంభ, ఊర్వశి, మేనకల పేర్లు రాసి ఉన్నగ్రంథం ఉంది.

దిశ, సినిమా: టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తూ.. అందరి మెప్పు పొందుతున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన కెరీర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 65వ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. నేడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘రంభ ఊర్వశి మేనక’ అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాకు ‘కామెడీ గోస్ కాస్మిక్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని సరికొత్తగా రూపొందిస్తున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది.
ఇందులో అల్లరి నరేష్ ఒక స్టైలిష్ అవతారంలో, స్వర్గలోకపు మెట్లపై కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన చేతిలో ఒక పెన్ను, అలాగే రంభ, ఊర్వశి, మేనకల పేర్లు రాసి ఉన్నగ్రంథం ఉంది. దేవకన్యలు మేఘాల మధ్య ఆయన చుట్టూ తిరుగుతున్నట్లు ఉన్న ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నరేష్ మార్క్ కామెడీతో పాటు, ఫాంటసీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది. అయితే అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ తర్వాత దాదాపు 14 ఏళ్ల విరామం అనంతరం ఫాంటసీ జానర్‌లో నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. భారీ బజ్ క్రియేట్ చేస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నవ్వుల హంగామాను మరింత పెంచడానికి వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి ప్రముఖ హాస్యనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.






