- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'సమ్మర్ హాలిడేస్' నుండి 'క్రష్ సాంగ్' విడుదల తేది వచ్చేసింది
'సమ్మర్ హాలిడేస్' సినిమాలోని 'క్రష్ సాంగ్'ను జూలై 1 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: 'సమ్మర్ హాలిడేస్' సినిమా నుంచి తొలి పాట 'క్రష్ సాంగ్' విడుదలకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'క్రష్ సాంగ్'ను జూలై 1 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీలోని మొదటి పాట క్లిక్ అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు. సాహిత్యాన్ని కిట్టు విస్సాప్రగడ రచించారు. మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, జయసుధ అమ్మమ్మ పాత్రలో కనిపించనున్నారు. అలాగే వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర్ నయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.






