- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి, సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు సంక్షేమం, అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పేర్కొన్నారు.

దిశ, హుజురాబాద్ రూరల్ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు సంక్షేమం, అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ, అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల పాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో అండగా నిలుస్తోందన్నారు. ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గంలో సుమారు రూ.10 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
అవినీతికి తావులేదు.. తేడా వస్తే సస్పెన్షనే!..
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని ప్రణవ్ బాబు స్పష్టం చేశారు. త్వరలోనే అర్హులైన నిరుపేదలకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల మంజూరు విషయంలో ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






