- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో ఇవాళ మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెంబూర్ (Chembur) ప్రాంతంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సుపై అకస్మాత్తుగా ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి పైగా పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చెంబూర్ (Chembur)లోని డైమండ్ గార్డెన్ సమీపంలోని రోడ్ నెంబర్ 11 నుంచి విద్యార్థులతో బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఓ పెద్ద చెట్టు ఒక్కసారిగా బస్సుపై కూలిపడటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పలువురు విద్యార్థులు ఉన్నారు. చెట్టు బస్సుపై బలంగా పడటంతో పిల్లలంతా భయాందోళనలతో కేకలు వేశారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన చాలా మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన 10 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత కారణంగా ఓ చిన్నారి ఇంకా బస్సు లోపలే ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.






