- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో మహేశ్‌బాబుకు షాకిచ్చిన GSTAT.. AMBతో సహా ఐదు థియేటర్లపై కొరడా
జీఎస్టీ రేట్లు తగ్గినా సినిమా టికెట్ల ధరలు తగ్గించకుండా లాభపడిన మహేష్ బాబు 'AMB సినిమాస్' సహా తెలంగాణలోని 6 థియేటర్లపై GSTAT కొరడా ఝుళిపించింది.

దిశ, వెబ్‌డెస్క్: మూవీ టికెట్లపై జీఎస్టీ (GST) రేట్లు తగ్గినా.. ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు వర్తింపజేయకుండా లాభపడినందుకు గాను సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు చెందిన AMB సినిమాస్‌తో సహా తెలంగాణలోని ఐదు థియేటర్లపై వస్తు సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) కఠిన చర్యలు తీసుకున్నది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మొత్తం రూ.1.7 కోట్లను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.
కాగా, మూవీ టికెట్లపై 2019 జనవరి 1 నుంచి జీఎస్టీని తగ్గించినప్పటికీ, సదురు థియేటర్లు బేస్ టికెట్ ధరలను పెంచి తుది ధరను యథాతథంగా ఉంచాయి. దీంతో ప్రేక్షకులకు దక్కాల్సిన బెనిఫిట్స్ థియేటర్లే పొందాయని ట్రిబ్యునల్ నిర్ధారించింది. ఇక ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మీషన్ ఇచ్చిందని ఏఎంబీ వాదనను GSTAT తోసిపుచ్చింది. ప్రభుత్వ అనుమతులు ఉన్నా కేంద్ర జీఎస్టీ నిబంధనల నుంచి మినహాయింపు లభించదని స్పష్టం చేసింది. ఏఎంబీ సినిమాస్ వాటాగా తేలిన రూ.1.1 కోట్లలో ప్రస్తుతం రూ.35 లక్షలు జమ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు విశ్వనాథ్ 70MM, ఏఎస్ఆర్ సినిమా, కుమార్ 70ఎంఎం థియేటర్లకు జూన్ 28, 2019 నుంచి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉల్లంఘనలు జనవరి 1, 2020 కంటే ముందే జరిగినందున, సాంకేతిక కారణాల రీత్యా థియేటర్లపై ఎలాంటి అదనపు జరిమానాలు విధించలేదు.
థియేటర్ల వారీగా చెల్లించాల్సిన మొత్తాలు ఇలా..
ఏఎంబీ సినిమాస్ ఎల్ఎల్‌పీ: రూ.35 లక్షలు
జ్యోతి థియేటర్: రూ.19.8 లక్షలు
భ్రమరాంబ సినిమాస్: రూ.11.8 లక్షలు
ఏఎస్ఆర్ సినిమా ఎల్ఎల్‌పీ: రూ.9.6 లక్షలు (+18 శాతం వడ్డీ)
విశ్వనాథ్ సినిమా: రూ.9 లక్షలు(+18 శాతం వడ్డీ)
కుమార్ 70MM: రూ.2.5 లక్షలు (+18 శాతం వడ్డీ)






