మంచిర్యాల జిల్లాలో 3 ఆసుపత్రులు సీజ్

by Vinod kumar |

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు - Siege of 3 hospitals in Manchirala district

మంచిర్యాల జిల్లాలో 3 ఆసుపత్రులు సీజ్
X

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులపై రెండో రోజు కొనసాగుతున్న తనిఖీలు. శుక్రవారం వైద్య,ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీస్, ఐ.ఎం.ఎ. అధికారులతో తనిఖీల్లో భాగంగా మూడు డెంటల్ ఆసుపత్రులు.. వికాన్, నరేష్, స్మైల్ డెంటల్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులను నిర్వహించాలని సూచించారు. రోగులకు వైద్య సేవలతో పాటు సదుపాయాలు కల్పించడం లో నియమావళి తప్పనిసరిగా పాటించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story