- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మాయోన్' నుంచి స్పెషల్ సాంగ్.. మాయచేసిన ఇళయరాజా
దిశ, సినిమా : సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మాయోన్’. ఎన్. కిషోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి రీసెంట్‌గా ఒక పాట రిలీజ్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా : సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మాయోన్'. ఎన్. కిషోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి రీసెంట్‌గా ఒక పాట రిలీజ్ చేశారు మేకర్స్. 'ఏదో ఏదో ఏదో.. వెతికే నయనం.. చేతికి అందేదాకా ఆగదు పయనం' అంటూ సాగే గీతం నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇక సినిమాను జులై 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలకు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ లభించిందని, హీరో సిబిరాజ్‌కు మంచి భవిష్యత్ ఉండబోతుందని అన్నారు. అంతేకాదు గాడ్ వెర్సస్ సైన్స్ మెయిన్ థీమ్‌గా రూపొందిన చిత్రంలో ఫొటోగ్రఫీ స్పెషల్ ఎస్సెట్‌గా నిలుస్తుందని చెప్పారు. మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్, అరుణ్ మోజి మాణికం నిర్మించిన మూవీలో తాన్య రవిచంద్రన్, రాధా రవి, రవికుమార్, చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






