అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై కృష్ణారెడ్డి సస్పెండ్

by Batti.Sumithra |

గతంలో మర్రిగూడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన కృష్ణారెడ్డి పై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై కృష్ణారెడ్డి సస్పెండ్
X

దిశ, మర్రిగూడ : గతంలో మర్రిగూడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన కృష్ణారెడ్డి పై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన పై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల పై శాఖాపరమైన విచారణ చేపట్టిన అనంతరం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే కృష్ణారెడ్డిని నల్గొండ వీఆర్‌కు అటాచ్ చేసిన అధికారులు, విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో మర్రిగూడ ఎస్‌ఐగా మిర్యాలగూడ టూ టౌన్‌లో విధులు నిర్వహిస్తున్న రాంబాబును ఇప్పటికే బదిలీ చేసిన విషయం తెలిసిందే. కృష్ణారెడ్డి పై బాధితుల పై అక్రమ కేసులు నమోదు చేయడం, అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన శాఖాపరమైన విచారణ అనంతరం అధికారులు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోపణల పై పోలీసు శాఖ నుంచి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

"పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడే నిర్ణయం".. దోమల వెంకన్న

ఎస్ఐ కృష్ణారెడ్డి సస్పెన్షన్‌ పై టీడీపీ మండల అధ్యక్షుడు దోమల వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలను పట్టించుకోకుండా బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి పై చర్యలు తీసుకోవడం స్వాగతించదగ్గ నిర్ణయమని అన్నారు. ఇలాంటి చర్యలతో పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని, మర్రిగూడలో అక్రమ దందాలు, మాఫియా కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించే అధికారులకు కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని ప్రజలు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.

Next Story