Shruti Haasan: అలాంటి ప్రాబ్లమ్స్ గురించి మహిళకే బాగా తెలుసు.. స్టార్ నటి

by Manoj |   (  Updated:2022-06-30 08:59:15  IST  )

Shruti Haasan Says Her Body is not in perfect Condition| స్టార్‌ యాక్ట్రెస్ శ్రుతి హాసన్‌ ఇటీవల ఫిజికల్ ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్నట్లు తెలిపింది. మెంటల్‌‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ, హార్మోన్ల సమస్యలు తనను వేధిస్తున్నాయంటోంది.

Shruti Haasan Says Her Body is not in perfect Condition
X

దిశ, సినిమా: Shruti Haasan Says Her Body is not in perfect Condition| స్టార్‌ యాక్ట్రెస్ శ్రుతి హాసన్‌ ఇటీవల ఫిజికల్ ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్నట్లు తెలిపింది. మెంటల్‌‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ, హార్మోన్ల సమస్యలు తనను వేధిస్తున్నాయంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

జిమ్‌లో వర్క్ అవుట్స్ వీడియోను షేర్ చేస్తూ.. ప్రస్తుతం కొన్ని చెత్త హార్మోన్ల సమస్యల నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నానని, హార్మోనల్‌ ఇమ్‌బ్యాలెన్స్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులుంటాయో మహిళకే బాగా తెలుసని చెప్పింది. అయితే దీని గురించి ఎక్కువగా చింతించకుండా టైమ్‌కి తినడం, నిద్ర, వ్యాయమం చేస్తున్నట్లు వెల్లడించిన బ్యూటీ.. ఇలాంటి సవాళ్లను ధైర్యంగా స్వీకరించి జీవితాన్ని మరింత స్ట్రాంగ్‌ మార్చుకోవాలని అభిమానులకు సూచించడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా తన ఫ్యాన్స్ మద్ధతుగా నిలుస్తున్నారు.

Next Story