- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తింట్లోకి శృతి హాసన్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నటి, గాయని శృతి హాసన్ వరుస సినిమాలతో, పాటలతో బిజీగా ఉంటూనే.. చెన్నై నగరంలో కొనుగోలు చేసిన తన కొత్త లగ్జరీ ఇంట్లోకి అత్యంత వైభవంగా గృహ ప్రవేశం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి, గాయని శృతి హాసన్ తన జీవితంలో మరో సరికొత్త మైలురాయిని చేరుకుంది. వరుస సినిమాలతో, పాటలతో బిజీగా ఉంటూనే.. చెన్నై నగరంలో కొనుగోలు చేసిన తన కొత్త లగ్జరీ ఇంట్లోకి అత్యంత వైభవంగా గృహ ప్రవేశం చేసింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శృతి హాసన్ గృహప్రవేశ పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. ప్రస్తుతం ఈ గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
గృహ ప్రవేశం సందర్భంగా ప్రత్యేక పూజాలో శృతి హాసన్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. పూజా మందిరంలో నేలపై కూర్చుని ప్రత్యేక హోమాలు, పూజా విధానాలు, నైవేద్యాల సమర్పణతో పాటు గృహప్రవేశ శాస్త్రోక్త క్రతువులన్నింటినీ ఆమె స్వయంగా నిర్వహించింది. తన వ్యక్తిగత జీవితంలో ఈ నూతన గృహం ఎంతో ఆనందాన్ని, మానసిక బలాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. ముంబైలో కూడా శృతికి సొంత ఇల్లు ఉండగా.. కుటుంబ సభ్యులు, సినిమా షూటింగ్స్ కోసం చెన్నైలో ఈ ఇల్లు కొన్నదని సమాచారం. కాగా శృతి హాసన్ నూతన గృహ ప్రవేశం పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






