- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉర్ధూ యూనివర్సిటి భూములపై షోకాజ్ నోటీసు విద్యా హక్కుల పై దాడి: ఎస్ఎఫ్ఐ
ఉర్దూ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)కు కేటాయించిన భూమిలోని 50 ఎకరాలను ఉపయోగించలేదనే నెపంతో తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. 1998లో స్థాపించబడిన మనూ యూనివర్సిటీ విద్యార్థుల అవసరాల దృష్ట్యా సుమారు 200 ఎకరాల భూమి కేటాయించబడిందని, నూతనంగా ఏర్పడిన మనూ యూనివర్సిటీకి మౌలిక సదుపాయాలు ఒకేసారి నిర్మించడం సాధ్యం కాని పరిస్థితుల్లో వినియోగించ లేదు. భూమిని ఉపయోగించలేదనే పేరుతో భూమిని లాక్కోవడం విద్యా హక్కు పై దాడి చేయడమేనని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. విశ్వవిద్యాలయల భూములను కార్పొరేట్లకు, రియల్ ఎస్టేట్ మాఫియాలకు అప్పగించేందుకు కాదని అది విద్యార్థులకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలని ఎస్‌ఎఫ్‌ఐ స్పష్టం చేసింది.
గతంలో హెచ్‌సియు భూములను తీసుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. విద్యార్థుల పోరాటం వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మనూలో ఇప్పటికీ సరిపడా హాస్టళ్లు, అకడమిక్ భవనాలు, పరిశోధనా సదుపాయాల కొరత ఉంది. ఖాళీగా ఉన్న భూమిని యూనివర్సిటీ అభివృద్దికి ఉపయోగించకుండా కార్పోరేట్ శక్తులకు కేటాయించటం సరైనది కాదని పేర్కొంది. యూనివర్సిటీ భూములపై జారీ చేసిన షోకాజ్ నోటీసును వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, విశ్వవిద్యాలయ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోకూడదని, హాస్టళ్ళు, అకడమిక్ బ్లాకులు, పరిశోధనా కేంద్రాల నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మనూ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటి కోరింది.






