నెత్తుటిమయమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌.. 11 మంది మృతి

by Muthe.Rajitha |

మెక్సికోలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ రక్తసిక్తమైంది.

నెత్తుటిమయమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌.. 11 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మెక్సికోలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ రక్తసిక్తమైంది. గువనాజువాటో రాష్ట్రం సలామాంకాలో లోమా డి ఫ్లోరెస్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మాస్క్‌లు ధరించిన దుండగులు మైదానంలోకి దూసుకువచ్చి ఆటగాళ్లు, ప్రేక్షకులు, వారి కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ దాడి వెనుక గువనాజువాటో రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్ కార్టెల్స్ మధ్య ఘర్షణలే కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తీవ్రంగా ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్టు సమాచారం.

Next Story