- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్ అగ్రికల్చర్‌లో ప్రకంపనలు.. ‘దిశ’ కథనాలతో కదిలిన ఉన్నతాధికారులు
వికారాబాద్ జిల్లాను కుదిపేసిన సబ్సిడీ వేరుశనగ విత్తనాల కుంభకోణంపై ‘దిశ’ పత్రిక వరుస కథనాలకు అగ్రికల్చర్ కమిషనరేట్ స్పందించింది.

దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లాను కుదిపేసిన సబ్సిడీ వేరుశనగ విత్తనాల కుంభకోణంపై ‘దిశ’ పత్రిక వరుస కథనాలకు అగ్రికల్చర్ కమిషనరేట్ స్పందించింది. కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్, దుద్యాల ఏఓ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయి పరిశీలనలో కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల, బొంరాస్‌పేట్ మండలాల్లో 80శాతం నుంచి 90శాతం మంది రైతులు తాము విత్తనాలే తీసుకోలేదని తేల్చారు. ఇప్పటికే బొంరాస్‌పేట్ ఏఈఓ జగదీశ్వర్ రెడ్డి, దౌల్తాబాద్ ఏఈఓ మమతను టెర్మినేట్ చేయగా.. తాజాగా ఏడీఏ, ఏఓల సస్పెన్షన్లతో ప్రకంపనలు రేపుతున్నాయి.
పెద్ద తలకాయలు సేఫ్ జోన్‌లోనేనా?
కీలక బాధ్యులను వదిలేసి కిందిస్థాయి సిబ్బంది పైనే చర్యలు తీసుకోవడం పై విమర్శలు వస్తున్నాయి. స్కామ్ జరిగిన సమయంలో డీఏఓగా ఉండి, జూన్ 30న రిటైర్ అయిన రాజారత్నం పై విచారణ జరిపి, రికవరీ చర్యలు చేపట్టలేదు. బోగస్ లబ్ధిదారులు తేలిన దౌల్తాబాద్ నుంచి లావణ్యను పూడూర్ మండలానికి బదిలీ చేసి రక్షణ కల్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల పర్యవేక్షణ చూసిన టెక్నికల్ ఏడీఏ సందీప్ పాత్రపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఫిజికల్ ఆడిట్ ఎందుకు చేయలేదు..
కలెక్టర్ ఆదేశించినా బషీరాబాద్, యాలాల, దోమ, కుల్కచర్ల మండలాల్లో ఫిజికల్ ఆడిట్ ఎందుకు చేయలేదని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం కొందరి సస్పెన్షన్లతో ఈ స్కామ్‌ను ముగించకుండా.. రిటైర్డ్ అధికారి రాజారత్నం, బదిలీ అయిన లావణ్య, టెక్నికల్ ఏడీఏ సందీప్‌లతో పాటు మిగిలిన 4 మండలాల్లోనూ సమగ్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.






