- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా శాంతి చర్చలపై ఇరాన్ షాకింగ్ ఆంక్షలు
అమెరికా శాంతి ప్లాన్‌కు ఇరాన్ షాక్! అంక్షలు ఎత్తివేస్తేనే చర్చలంటూ భీష్మించుకున్న టెహ్రాన్. జలసంధిలో నౌకల రాకపోకలపై కొత్త నిబంధనలు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం గత 25 రోజులుగా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో 15 అంశాల శాంతి ప్రణాళికను (peace plan) ప్రతిపాదించారు. ఈ ప్రణాళికలో ఇరాన్ (Iran) తన అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని, యురేనియం నిల్వలను అప్పగించాలని, అంతర్జాతీయ నౌకల రాకపోకల కోసం 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధిని తెరవాలని ప్రధానంగా కోరారు. అయితే, ఇరాన్ ఈ ప్రతిపాదనలపై సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా తనపై విధించిన ఆర్థిక అంక్షలను పూర్తిగా ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేస్తూనే, ఎదురుదాడిలో భాగంగా అమెరికా ఉన్నతాధికారులు, రక్షణ సంస్థలపై సొంతంగా ఆంక్షలు (Sanctions) విధిస్తూ షాక్ ఇచ్చింది.
శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ ఒక వినూత్నమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి అమెరికా- ఇజ్రాయెల్ నౌకకు ప్రతిఫలంగా, ఇరాన్‌పై ఉన్న ఒక అంతర్జాతీయ అంక్షను తొలగించాలని (One-for-one swap) షరతు పెట్టింది. దీనితో పాటు గత దాడుల వల్ల జరిగిన నష్టానికి భారీగా పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో దాడులు జరగవని అంతర్జాతీయ హామీ ఇవ్వాలని ఇరాన్ విదేశాంగ శాఖ పట్టుబడుతోంది. అటు ట్రంప్ ప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, ఇరాన్ మాత్రం అధికారికంగా ఎటువంటి చర్చలు జరగలేదని కొట్టిపారేస్తూ పశ్చిమ దేశాల అధికారులపై అంక్షలు విధించడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అలాగే అరబ్ కంట్రీస్ లో ఉన్న యూఎస్ ఆర్మీ బేసులను కూడా తొలగించాలని ఇరాన్ తన అంక్షాల్లో తెలిపింది. దీనిపై అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






