- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. శ్రీలంక కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా
టీ20 వరల్డ్ కప్ వైఫల్యంతో శ్రీలంక కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా. 2026 వరకు కాంట్రాక్ట్ ఉన్నా సూపర్-8 ఓటమితో మధ్యలోనే తప్పుకున్న దిగ్గజం.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ను భారత్ నిర్వహించగా, పాకిస్తాన్ కోసం శ్రీలంకలో కూడా మ్యాచులు నిర్వహించారు. దీంతో ఈ టోర్నీకి శ్రీలంక కూడా ఆతిథ్యం అందించింది. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీలంక జట్టు సూపర్ 8 లో ఒక్క విజయం కూడా సాధించకుండానే ఎలిమినేట్ అయింది. దీంతో క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య తన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయన సారథ్యంలో టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, ముఖ్యంగా సూపర్-8 దశలోనే టోర్నీ నుండి నిష్క్రమించడం ఆయనను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. వాస్తవానికి జయసూర్య కాంట్రాక్ట్ జూన్ 2026 వరకు ఉన్నప్పటికీ, జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి మధ్యలోనే రాజీనామా చేశారు.
2024లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జయసూర్య హయాంలో శ్రీలంక జట్టు మిశ్రమ ఫలితాలను సాధించింది. అతని పర్యవేక్షణలో లంక జట్టు మొత్తం 76 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, అందులో 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. జయసూర్య అకస్మాత్తుగా తప్పుకోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. త్వరలోనే జరగబోయే సిరీస్‌ల కోసం అనుభవజ్ఞుడైన కోచ్‌ను నియమించాలని బోర్డు భావిస్తోంది.






