విజయ్ ఫ్యాన్స్ కు షాక్.. రిలీజ్‌కి ముందే ''బీస్ట్'' సిమిమా బ్యాన్..?

by Disha Web Desk 12 |
విజయ్ ఫ్యాన్స్ కు షాక్.. రిలీజ్‌కి ముందే బీస్ట్ సిమిమా బ్యాన్..?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ తలపతి విజయ్ నటించిన "బీస్ట్" సినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్దమైంది. అయితే విడుదలకు కొన్ని రోజులే ఉన్న తరుణంలో విజయ్ కు షాక్ తగిలింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ లో హైజక్‌కు గురైన మాల్‌లో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అయితే కొన్ని అరబిక్ దేశాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించే సినిమాలను ప్రదర్శించడానికి అంగీకరించవు.

ఇందులో భాగంగానే కువైట్ ప్రభుత్వం ''బీస్ట్'' సినిమాను తమ దేశంలో నిషేదించింది. ఇంతకు ముందు కూడా.. దుల్కర్ సల్మాన్ సినిమా 'కురూప్' ని కూడా కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే కువైట్ లో ''బీస్ట్'' సినిమా ను బ్యాన్ చేయడం, అదే బాటలో మరో అరబ్ దేశం కూడా ఇలానే చేసినా విజయ్ కి బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్ళ పరంగా బారీ దెబ్బతీస్తుందని చెప్పుకోవాలి.

Next Story