- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీవీకే అధినేత దళపతి విజయ్‌కి షాక్.. మరోసారి నోటీసులు ఇచ్చిన సీబీఐ
కరూర్ తొక్కిసలాట కేసులో తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, దళపతి విజయ్ (Thapathy Vijay)కి ఉచ్చు బిగుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: కరూర్ తొక్కిసలాట కేసులో తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, దళపతి విజయ్ (Thapathy Vijay)కి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో భాగంగా సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు విజయ్‌ను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇవాళ ఆయనకు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో ఈ నెల 19న మళ్లీ విచారణకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొన్నారు.
కాగా, గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే పార్టీ బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మరణించగా, సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపడుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు సీబీఐ విచారణలో విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసుల వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని, పరిస్థితిని గమనించి తాను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయానని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక డీఎంకే సర్కార్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విజయ్ విచారణలో చెప్పనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.






