- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టుకు మరో షాక్.. తొలి మ్యాచ్‌కు బుమ్రా దూరం?
టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాకముందు భారత జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత గడ్డపై ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాకముందు భారత జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత గడ్డపై ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటి గాయం కారణంగా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా జట్టకు దూరమవ్వగా.. మరికొద్ది గంటల్లో మొదటి మ్యాచ్ ప్రారంభమవ్వనున్న తరుణంలో ఊహించని షాక్ ఎదురైంది. భారత జట్టులో కీలక మైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శనివారం అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. గత కొద్దిరోజులుగా బుమ్రా స్వల్ప అనారోగ్యం తో బాధపడుతున్నట్లు సమాచారం. దీనివల్ల ఆయన మ్యాచ్‌కు ముందు జరిగిన కీలక ప్రాక్టీస్ సెషన్‌కు కూడా గైర్హాజరు కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం జరిగిన టీమ్ ట్రైనింగ్ సెషన్‌లో బుమ్రా పాల్గొనలేదు. జ్వరం, నీరసం కారణంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టోర్నీలో అత్యంత కీలకమైన బౌలర్ కావడంతో, రిస్క్ తీసుకోకూడదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒకవేళ బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకోకపోతే, అమెరికాతో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆయన స్థానంలో మరో పేసర్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతానికి బుమ్రా ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో బుమ్రా లేకపోవడం భారత బౌలింగ్ విభాగాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది. అయినప్పటికీ, తదుపరి మ్యాచ్‌ల నాటికి ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి జట్టులోకి చేరుతారని జట్టు సభ్యులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బుమ్రా వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయన శారీరక స్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఒక వేళ బుమ్రా ఆడటం కుదరకపోతే మహ్మద్ సిరాజ్ కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది.
భారత జట్టు: ఇషాన్ కిషన్ (Wk), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్,






