చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ అవుట్

by Malleboina Mahesh |

చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్‌కు గాయం! ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం. 10-12 వారాల విశ్రాంతి అవసరమన్న వైద్యులు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ అవుట్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో వరుస మూడు ఓటముల తర్వాత.. తిరిగి పుంజుకొని వరుసగా రెండు విజయాలతో చెన్నై జట్టు ఫామ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ (Khalil Ahmed) క్వాడ్రిసెప్స్ (Quadriceps) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఖలీల్ తన కుడి వైపు తుంటి భాగంలో నొప్పిగా ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై వైద్య పరీక్షలు నిర్వహించగా, అతనికి 'గ్రేడ్-2 టియర్' (కండరాల గాయం) అయినట్లు తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 10 నుంచి 12 వారాల సమయం పడుతుందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఖలీల్ అహ్మద్ (Khalil Ahmed) భాగమయ్యాడు. జట్టు విజయాల్లో తనదైన ముద్ర వేస్తూ, ప్రారంభ దశలో అత్యంత నిలకడగా రాణిస్తున్న బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఖలీల్, టీమ్ ఇండియా తరఫున ఇప్పటివరకు 11 వన్డేలు మరియు 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయన చివరిసారిగా జూలై 2024 లో భారత జట్టు తరపున మైదానంలోకి దిగాడు. కీలకమైన సమయంలో ఖలీల్ దూరం కావడం చెన్నై బౌలింగ్ విభాగానికి పెద్ద లోటుగానే చెప్పవచ్చు.

Next Story