- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనాలతో నాకేం సంబంధం.? శోభిత షాకింగ్ కామెంట్స్
చీకటి సిరీస్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొని నటి శోభిత ఆసక్తికర కామెంట్స్ చేసింది.‘పెళ్లైన తర్వాత వస్తున్న మొదటి సినిమా కదా.. జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారు?’ అని యాంకర్ ప్రశ్నించగా, ‘‘జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదు. అంటూ చెప్పుకొచ్చింది.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ, ఇంటి బాధ్యతల్లో నిమగ్నమైన శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)మళ్లీ వార్తల్లో నిలిచింది. పెళ్లి తర్వాత ఆమె నటించిన తొలి చిత్రం ‘చీకటిలో’(Cheekatilo) జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈక్రమంలో.. తాజాగా, శోభిత ప్రమోషన్స్‌లో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన వ్యక్తిగత అభిప్రాయాలను, వృత్తిపరమైన నిర్ణయాలను పంచుకున్నారు.
‘పెళ్లైన తర్వాత వస్తున్న మొదటి సినిమా కదా.. జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారు?’ అని యాంకర్ ప్రశ్నించగా, శోభిత చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ‘‘జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదు. వైజాగ్‌లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు నచ్చిన పనులే చేస్తున్నాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నా మనసుకి నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్నాను.
నేను నమ్మిన ప్రాజెక్ట్‌ను ఎప్పుడూ నిజాయితీగా చేస్తాను. నేను చేసే పని వల్ల జనాలు మెచ్చుకుంటారా లేదా నొచ్చుకుంటారా అని నేను ఎప్పుడూ ఆలోచించను. ఒక నటిగా నాకు నచ్చిన పాత్రకు న్యాయం చేయడమే నా బాధ్యత’’ అని శోభిత చెప్పింది. సమాజం లేదా ప్రేక్షకుల అభిప్రాయాల కోసం తన నిర్ణయాలను మార్చుకోనని ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.






