- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో మరో వ్యాధి కలకలం.. ఇద్దరు మృతి
కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం షిగెల్లా (Shigellosis) వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం షిగెల్లా (Shigellosis) వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. షిగెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల ఇద్దరు చిన్నారులు మరణించడమే కాకుండా.. ఈ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో అక్కడి ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం.. కేరళ వ్యాప్తంగా ఇప్పటివరకు 85 కంటే ఎక్కువ షిగెల్లా కేసులు అధికారికంగా నిర్ధారణ అయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే ఇద్దరు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిలో ఒకరు ఏప్రిల్ నెలలో మరణించగా, రెండో మరణం జూన్ 6వ తేదీన కోజికోడ్ జిల్లాలో నమోదైంది. ప్రస్తుతం ప్రధానంగా కోజికోడ్, వయనాడ్, మలప్పురం, అలప్పుళ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండటంతో కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, నిఘా (Surveillance) వ్యవస్థను ముమ్మరం చేసింది. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో కూడిన లక్షణాలు ఉండగా.. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ ప్రజలకు పలు జాగ్రత్తలను సూచించింది.






