- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బక్రీద్ పండగ.. ఆన్లైన్లో 15 నిముషాల్లోనే గొర్రెలు, ఒంటెలు డెలివరీ
మే 27న జరగనున్న బక్రీద్ పండగ నేపథ్యంలో గొర్రెలను ఆన్లైన్ డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది ఓ కంపెనీ.

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే.. పది నిముషాల్లోనే ఇంటికి వస్తాయి. ఇప్పటి వరకు కూరగాయలు, గ్రోసరీ, కిచెన్ సామాన్లు వంటి రకరకాల వస్తువులు ఆన్లైన్ లో అమ్మడం మనం చూసాం. అయితే రానున్న ఈద్ ఉల్ ఆధా (బక్రీద్) పండగను దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్ డెలివరీ యాప్ కంపెనీలు కొత్త తరహా అఫర్ కు తెరలేపారు. మే 27న జరగనున్న బక్రీద్ పండగ నేపథ్యంలో గొర్రెలను ఆన్లైన్ డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది ఓ కంపెనీ. ఈద్ రోజున 15 నిముషాల్లోనే కశ్మీరీ సోమాలీ షీప్స్, ఆవులు, ఒంటెలు డెలివరీ చేస్తామని అని పేర్కొంది. అయితే ఇది మన దేశంలో కాదు. యూఏఈ కంట్రీస్ లోని 'నూన్' అనే ఇన్స్టంట్ ఆన్లైన్ డెలివరీ సంస్థ చేసిన ఈ ప్రకటనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొందరు ఆన్లైన్ డెలివరీకి కాదేదీ అనర్హం అని ఫన్నీ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం జంతు బలులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై సదరు కంపెనీ చెబుతున్న వివరణ ఏమిటీ అంటే.. నేరుగా గొర్రెలను, ఆవులను, ఒంటెలను డెలివరీ చేయడం కాదని, ఏది కావాలో ఎన్నుకొని డబ్బులు పే చేసిన అనంతరం వాటిని బలిచ్చి, తర్వాత ఆ మాంసాన్ని మాత్రమే డెలివరీ చేస్తామని పేర్కోవడం కొసమెరుపు.






