భార‌త‌దేశంలోని గొప్ప న‌టీమ‌ణుల్లో ఆమె ఒక‌రు: రణ్‌బీర్ కపూర్

by Mallepaka Hamsa |

మ‌న‌ల్ని న‌ట‌న‌తో మెప్పించ‌టానికి, సంతోష‌పర‌చ‌టానికి జీవితాన్ని ఇచ్చిన ఎంట‌రటైన‌ర్ రాణి ముఖర్జీ.

భార‌త‌దేశంలోని గొప్ప న‌టీమ‌ణుల్లో ఆమె ఒక‌రు: రణ్‌బీర్ కపూర్
X

దిశ, సినిమా: ర‌ణ్‌భీర్ క‌పూర్(Ranbir Kapoor) త‌న ఇష్ట‌మైన న‌టి రాణీ ముఖ‌ర్జీ 30 వ‌సంతాల ప్ర‌స్థానాన్ని మ‌ర్దానీ 3 సినిమాతో సెల‌బ్రేట్ చేయ‌టానికి భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ క‌లిసి ముందుకు రావ‌టం చూసి చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌ణ్‌భీర్ క‌పూర్ మాట్లాడుతూ ‘‘రాణీ ముఖర్జీ(Rani Mukerji) సావరియా చిత్రంలో నాతో కలిసి నటించారు. నేనెంతో కష్టపడి నటించానని నాకు చెప్పి ప్రోత్సహించిన మొదటి వ్యక్తి త‌నే. నాకు, ఆమె జ‌రిగిన సంభాష‌ణ‌ను నేను మ‌ర‌చిపోలేను. నాకు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఆమె మాట‌లు నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. నేను రాణి ముఖర్జీని ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించాను. నేను రాణి వ‌ర్క్‌ను చాలా ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించాను.

ఆమె గ్రేస్‌, ఛార్మ్‌, తెలివితేట‌ల‌కు ముగ్ధుడిన‌య్యాను. రాణీ ముఖర్జీ త‌న 30 ఏళ్ల సినీ ప్ర‌యాణాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌టం నిజంగా అద్భుతం. రాణి ముఖర్జీ ఎప్పటికీ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా నేను భావిస్తాను. భార‌త‌దేశంలోని గొప్ప న‌టీమ‌ణుల్లో ఆమె ఒక‌రు. మ‌న ఇండ‌స్ట్రీ ఏంటో ఆమె త‌న ప‌నిత‌నంతో నిర్వ‌చించారు. ఆమె ఎంచుకునే సినిమాలు, పాత్ర‌లు ఇప్పుడు స్క్రీన్‌పై మ‌హిళ‌ల‌ను చూపించే విధానాన్ని మార్చాయి. రాణీ తన సినిమాలతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌నుకున్నారు. ఆమె మ‌న‌కు అందించిన చిత్రాలు, వాటి తీపి గుర్తులను మ‌నం మ‌ర‌చిపోలేం. అందుకు ఆమెకు ధ‌న్య‌వాదాలు. మ‌న‌ల్ని న‌ట‌న‌తో మెప్పించ‌టానికి, సంతోష‌పర‌చ‌టానికి జీవితాన్ని ఇచ్చిన ఎంట‌రటైన‌ర్ ఆమె. రాణి సినిమాలు నాపై చూపిన ప్ర‌భావాన్ని మాట‌ల రూపంలో చెప్ప‌లేను’’ అన్నారు.

Next Story