- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shamshera: షంషేరా టీజర్ : యోధుడి పాత్రలో సీనియర్ హీరో..
Shamshera Official Teaser Released| రణబీర్ కపూర్, వాణి కపూర్ జంటగా నటిస్తున్న 'షంషేరా' సినిమా కోసం మూవీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో పోషిస్తున్న

X
దిశ, సినిమా : రణబీర్ కపూర్, వాణి కపూర్ జంటగా నటిస్తున్న 'షంషేరా' సినిమా కోసం మూవీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే రిలీజైన ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 1.22 సెకన్ల నిడివి గల టీజర్‌ను విడుదల చేయగా.. మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
టీజర్‌లో సంజయ్ దత్ గంభీరమైన పాత్రలో కనిపించగా.. రణబీర్ ఒక యోధుడిలా, ప్రజలను కాపాడే లెజెండ్‌గా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సినిమా ట్రైలర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు టీజర్‌లో పేర్కొన్న మేకర్స్ త్వరలోనే ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్రారంభించనున్నారు. కాగా ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో జూలై 24న విడుదల కానుంది.
Next Story






