TG: షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, గుత్తా అమిత్‌ రెడ్డికి కీలక బాధ్యతలు

by Gantepaka Srikanth |

టీపీసీసీ ఓబీసీ విభాగ చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే కే.శంకరయ్య నియమితులయ్యారు.

TG: షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, గుత్తా అమిత్‌ రెడ్డికి కీలక బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ ఓబీసీ విభాగ చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే కే.శంకరయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విభాగానికి కన్వీనర్స్‌గా కీతూరి వెంకటేష్, జూలూరు ధనలక్ష్మిలను నియమించారు. ఇది వరకే ఎస్సీ విభాగ చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆదివాసీ విభాగ చైర్మన్‌గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లను ఏఐసీసీ నియమించింది.

వార్ రూం చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వార్ రూం చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ ఉత్తర్వులు ఇచ్చారు. గుత్తా అమిత్ రెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి రాజకీయ వ్యూహాలు, ఎప్పటికప్పుడు నేతలను సమన్వయం పర్చడం, పార్టీకి సంబంధించిన విజయావకాశాలపై చర్చలు, నిర్ణయాలను తీసుకునేలా వ్యవహారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కావడం గమనార్హం.

Next Story