- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"అంకుల్ మా ఇల్లెందుకు కూల్చారు?" : ప్రధానికి ఏడేళ్ల చిన్నారి కన్నీటి లేఖ.. వైరల్
ఇటీవల నేపాల్ లో 'జెన్ జీ'ల ఉద్యమంతో అధికారంలోకి వచ్చిన బాలేంద్ర షా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల నేపాల్ లో 'జెన్ జీ'ల ఉద్యమంతో అధికారంలోకి వచ్చిన బాలేంద్ర షా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పేదల ఇళ్ళు కూల్చడంతో 'అంకుల్ మా ఇల్లెందుకు కూల్చారు?' అంటూ ప్రధానికి ఓ ఏడేళ్ల చిన్నారి రాసిన లేఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే నేపాల్ రాజధాని కాఠ్మాండులో నదీ తీర ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. అధికారులు దాదాపు 4 వేల తాత్కాలిక నిర్మాణాలు కూల్చివేయడంతో 15 వేల మంది పేదలు నిరాశ్రయులు అయ్యారు. అనంతరం వీరందరిని కాఠ్మాండుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న బవేసా మున్సిపాలిటీ పరిధిలోని పునరావాస శిబిరానికి తరలించారు అధికారులు. కాగా నిరాశ్రయులు అయిన వారిలో ఏడేళ్ల రాధిక అనే బాలిక తన చదువుకు దూరం కాగా తన ఆవేదనను ప్రధాని బాలేంద్ర షా కు లేఖలో రాసింది.
"మా ఇల్లెక్కడ? నేను ఎలా చదుకోవాలి?"
"అంకుల్ మా ఇంట్లో వారంతా మీకే ఓటు వేశామని అన్నారు. మరి మా ఇల్లెందుకు కూల్చారు?. ఇపుడు మేమంతా ఎక్కడ ఉండాలి? నేను ఎలా చదువుకోవాలి?" అంటూ రాసిన లేఖ ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. క్షణాల్లోనే ఈ లేఖ దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్థించుకుంది. నదీ తీర ప్రాంతాల్లో ఆక్రమణలు పెరగడం వల్ల కాఠ్మాండుకు వరద ముప్పు పొంచి ఉందని, అందుకే వారందరినీ ఖాళీ చేయించామని తెలిపింది. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు... సరైన పునరావాస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా బాధితులను తరలించడం తప్పని ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. తక్షణమే వారికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.






