- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్నెగూడ ఆర్‌టీఏ కార్యాలయంలో నిలిచిన సేవలు..
మన్నెగూడ ఆర్‌టీఏ కార్యాలయంలో సాంకేతిక సమస్యల కారణంగా సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దిశ, తుర్కయంజాల్ : మన్నెగూడ ఆర్‌టీఏ కార్యాలయంలో సాంకేతిక సమస్యల కారణంగా సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌లు, యాజమాన్య మార్పిడి తదితర పనుల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గంటల తరబడి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. సేవలు నిలిచిపోవడంతో కార్యాలయానికి వచ్చిన పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల పై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో సమయం, ప్రయాణ ఖర్చులు వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కార్యాలయం వెలుపల నోటీసు బోర్డు లేదా ఆన్‌లైన్ ద్వారా సమాచారం అందించి ఉంటే ఇబ్బందులు తప్పేవని పేర్కొన్నారు.
ఆర్‌టీఏ అధికారుల నిర్లక్ష్య వైఖరి పై వినియోగదారులు మండిపడుతూ, సేవల అంతరాయం ఏర్పడినప్పుడు ప్రజలకు వెంటనే సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సేవలను పునరుద్ధరించాలని కోరారు. అధికారులు మాత్రం సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని, సేవలు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. ఆర్‌టీఏ అధికారులు మాట్లాడుతూ సాంకేతిక లోపాలను సరిచేసే పనులు కొనసాగుతున్నాయని, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సేవలు అందుబాటులోకి వచ్చాయని, యధావిధిగా సేవలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.






