- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడవటూర్ గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల పై విచారణ
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామపంచాయతీలో 2012 నుంచి 2021 వరకు జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవినీతి అక్రమాలు, నకిలీ బిల్లుల వ్యవహారం పై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది.

దిశ, బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామపంచాయతీలో 2012 నుంచి 2021 వరకు జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవినీతి అక్రమాలు, నకిలీ బిల్లుల వ్యవహారం పై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. గ్రామపంచాయతీలో జరిగిన అక్రమాల పై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, గత ఐదేళ్ల కాలంలో విచారణ నిర్వహించిన కొంతమంది అధికారులు హైకోర్టు, లోకాయుక్తకు తప్పుడు నివేదికలు సమర్పించారని ఫిర్యాదు దారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఆడిట్ అధికారి దేవేందర్, ఇన్‌చార్జి డీపీఓ వెంకట్‌రెడ్డి, ఎంపీవో రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వీరస్వామి సమక్షంలో గ్రామపంచాయతీ రికార్డులు, బిల్లులు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాల పై విచారణ నిర్వహించారు. విచారణ సందర్భంగా సంబంధిత పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, పనుల అమలుకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీలో జరిగిన అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఫిర్యాదుదారులు కోరుతున్నారు.






