వైభవ్‌తో గొడవ.. శ్రీలంక ఆటగాడికి షాకిచ్చిన ఐసీసీ

by velandi.Saikiran |

వైభవ్‌తో గొడవ ప‌డిన‌ శ్రీలంక ఆటగాడికి షాకిచ్చింది ఐసీసీ.

వైభవ్‌తో గొడవ.. శ్రీలంక ఆటగాడికి షాకిచ్చిన ఐసీసీ
X

దిశ‌, వెబ్ డెస్క్: శ్రీలంక A జట్టు ప్లేయర్లతో వైభవ్ గొడవపడిన సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో వైభవ్ ను శ్రీలంక క్రికెటర్లే రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో వైభవ్ పై చర్యలు తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఐసీసీ మాత్రం శ్రీలంక ఆటగాడు విషేన్ హలంబగేకు ఫైన్ విధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అటు క్రిక్ బజ్ కూడా ఇదే విష‌యాన్ని పేర్కొంది. కానీ వైభవ్ సూర్యవంశీకి ఐసీసీ ఫైన్ విధించిందా ? లేదా ? అనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. అతనిపై కూడా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా, నిన్న జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా సూప‌ర్ ఓవ‌ర్ జ‌రుగ‌గా, పెవిలియ‌న్ వైపు వెళుతోన్న వైభ‌వ్ ను విషేన్ హలంబగే రెచ్చ‌గొట్టారు. దీంతో వైభ‌వ్ కూడా గొడ‌వ‌కు దిగాడు.

Next Story