వర్గల్ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

by Batti.Sumithra |

సిద్దిపేట-హైదరాబాద్ ప్రధాన రహదారి పై వర్గల్ మండలంలోని గౌరారం గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

వర్గల్ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, వర్గల్ : సిద్దిపేట-హైదరాబాద్ ప్రధాన రహదారి పై వర్గల్ మండలంలోని గౌరారం గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గజ్వేల్ రూరల్ సీఐ డి. రవి రాజు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ కట్కూరి అశోక్ అజాగ్రత్తగా, అతివేగంగా వాహనం నడుపుతూ ముందుగా వెళ్తున్న ఆటోను ఢీ కొట్టాడు. దీంతో ఆటో అదుపుతప్పి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన కాయితి సత్తయ్య (42)ను ఢీ కొట్టింది. అనంతరం ఆటో పల్టీలు కొడుతూ ముందుకు వెళ్లగా, కారు కూడా పల్టీలు కొడుతూ వచ్చి ఆటో వెనుక భాగం పై పడింది. ఈ ప్రమాదంలో కాయితి సత్తయ్యతో పాటు వేములఘాట్ గ్రామానికి చెందిన కొరిమి లక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ కొరిమి శ్రీనివాస్, అతని కుమార్తెకు గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ కొరిమి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కట్కూరి అశోక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ డి. రవిరాజు తెలిపారు.

Next Story