- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..
మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక సెషన్ జడ్జి, రేప్ అండ్ పోక్సో కేసుల విచారణ కోర్టు న్యాయమూర్తి తమన్ రాజ రాజేశ్వరీ నిందితుడుకి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రైం నెంబర్ 592/2025 కేసులో లైంగిక దాడికి పాల్పడిన ఎదిర గ్రామస్తుడైన తక్కనపల్లి శివశంకర్ (38)తండ్రి బాల మల్లప్ప పై చేపట్టిన విచారణ, దర్యాప్తు అనంతరం నిందితుడిపై పటిష్టమైన సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ గాంధీ నాయక్, ఎస్‌హెచ్‌ఓ జి.విజయ్ కుమార్, ప్రత్యేక ప్రజా అభియోజకులు ఎం.జాన్, కోర్టు లైజన్ అధికారులుగా విధులు నిర్వహించిన బాలకృష్ణ (ఏఎస్‌ఐ) తదితర పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక నేరాల పట్ల జిల్లా పోలీస్ శాఖ అంత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు.






