విజయ్ దేవరకొండ కోసం ‘ది మమ్మీ’ విలన్.. పోస్టర్‌తో సినిమాపై భారీ హైప్

by Chukka Sudharani |

విజయ్ దేవరకొండ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రణబాలి’ ఒకటి.

విజయ్ దేవరకొండ కోసం ‘ది మమ్మీ’ విలన్.. పోస్టర్‌తో సినిమాపై భారీ హైప్
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రణబాలి’ ఒకటి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో.. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్‌లో వేగం పెంచిన టీమ్.. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా 90% చిత్రీకరణ కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌తో పాటు ఓ సాలిడ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. ఈ మేరకు ‘రణబాలి’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో భయంకరమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ.. ‘కరువు రాక్షసుడు- సర్ థియోడోర్ హెక్టర్.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను 'ది మమ్మీ' చిత్రంలో ఇమ్హోటెప్ పాత్రతో అలరించిన ఆర్నాల్డ్ వోస్లో ఇప్పుడు రణబాలిలో క్రూరమైన 'సర్ థియోడోర్ హెక్టర్' పాత్రతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.. భారతీయ సినిమాకు స్వాగతం’ అంటూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఆర్నాల్డ్ వోస్లో ఎంట్రీతో విజయ్ దేవరకొండ సినిమాపై మరింత హైప్ పెరిగింది.

Next Story