రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 13 |
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
X

దిశ, తుర్కపల్లి: రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి ప్రమాద సంఘటన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తుర్కపల్లి మండలం ఇబ్రహింపురం గ్రామానికి చెందిన గడిపే శ్యామ్ అనే యువకుడు ఆదివారం తన స్నేహితుడితో కలిసి జగదేవ్ పూర్ లో ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగా వాసాలమర్రి పెట్రోల్ బంక్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హైదరాబాద్ ప్రయివేటు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉన్న ఒక్క కొడుకు ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తూ తమను ఆదుకోవాలని వేడుకున్నారు.





Next Story

Most Viewed