Stock Market: నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
Stock Market: నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా ఐటీ రంగంలో మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో సూచీలు దెబ్బతిన్నాయి. మార్చి త్రైమాసికానికి సంబంధించి ఐటీ దిగ్గజాలు ఆదాయ వివరాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారని విశ్లేషకులు తెలిపారు. ఈ కారణంగానే సోమవారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 482.61 పాయింట్లు పడిపోయి 58,964 వద్ద, నిఫ్టీ 109.40 పాయింట్లు తగ్గి 17,674 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫైనాన్స్ రంగాలు 1 శాతం మేర క్షీణించాయి. మీడియా, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ, ఎన్‌టీపీసీ, టీసీఎస్, ఆల్ట్రా సిమెంట్, నెస్లె ఇండియా షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌సీఎల్‌టెక్, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డా రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.93 వద్ద ఉంది.



Next Story

Most Viewed