స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ జోష్!

by Disha Web Desk 17 |
స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ జోష్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. శుక్రవారం ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడంతో మదుపర్లలో ఉత్సాహం పెరిగింది. ఉదయం ప్రారంభమైన సమయంలో లాభనష్టాలకు మధ్య ఊగిసలాడిన సూచీలు మిడ్-సెషన్ సమయానికి కోలుకున్నాయి. ఆర్‌బీఐ నిర్ణయాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లలో జోరు పెరిగింది. ముఖ్యంగా గత మూడు సెషన్లుగా నీరసించిన స్టాక్ మార్కెట్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకున్నాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 412.23 పాయింట్లు ఎగసి 59,447 వద్ద, నిఫ్టీ 144.80 పాయింట్లు పెరిగి 17,784 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు 2 శాతానికి పైగా పుంజుకోగా, ఐటీ రంగం మాత్రమే స్వల్పంగా నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ షేర్లు 4 శాతం లాభపడి 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. ఎం అండ్ ఎం, డా రెడ్డీస్, టైటాన్, రిలయన్స్, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు 1 శాతం నుంచి 3 శాతం మధ్య ర్యాలీ చేశాయి. టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.85 వద్ద ఉంది.



Next Story

Most Viewed