- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలిక ఆత్మహత్య కేసులో సంచలనం.. మరో ముగ్గురు అరెస్ట్!
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన బాలిక ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

దిశ,చంపాపేట్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన బాలిక ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, గురువారం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితురాలు పరారీలో ఉండటంతో ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణి కాలనీకి చెందిన అమూల్య శ్రీ(17) గత నెల 28న తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి మేఘావత్ నారాయణ అలియాస్ మహేష్‌తో ప్రేమ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంబంధాన్ని వ్యతిరేకించిన మహేష్ కుటుంబ సభ్యులు ఆమెను పలుమార్లు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటన అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేఖతో పాటు మృతురాలు రాసిన ఇతర పత్రాలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్ నిపుణులు సమర్పించిన నివేదికలో ఆత్మహత్య లేఖతో పాటు ఇతర లేఖలు కూడా ఒకే వ్యక్తి రాసినవేనని నిర్ధారించడం దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. అలాగే మృతురాలు, నిందితులకు సంబంధించిన సెల్‌ఫోన్లను సేకరించి వాటి డేటాను విశ్లేషణ కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మహేష్, అతని తండ్రి వాల్‌సింగ్‌ను మే 30న అరెస్ట్ చేయగా, తాజాగా కుమార్, రమేష్, పూజలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సుజాతను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన యువతలో పెరుగుతున్న భావోద్వేగ ఒత్తిళ్లు, సామాజిక ఒత్తిడులు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో మరోసారి గుర్తు చేస్తుంది. పిల్లల మానసిక పరిస్థితి పై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.






