జార్ఖండ్‌లో ‘క్రాస్ ఓటింగ్’ కలకలం.. బీజేపీ మద్దతుదారుడికి రాజ్యసభ సీటు

by Kema Shiva Kumar |

జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం రేపింది.

జార్ఖండ్‌లో ‘క్రాస్ ఓటింగ్’ కలకలం.. బీజేపీ మద్దతుదారుడికి రాజ్యసభ సీటు
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ (Jharkhand) రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్జరగడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఇరుపక్షాల నుంచి బలాబలాల సమీకరణాలు మారడంతో, భారతీయ జనతా పార్టీ (BJP) మద్దతు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ (Parimal Nathwani) రాజ్యసభకు ఎన్నికయ్యారు. జార్ఖండ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య ప్రకారం అధికారిక కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, పోలింగ్ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్వతంత్ర అభ్యర్థి వెనుక తన పూర్తి బలాన్ని నిలపడంతో పాటు, ఇతర పార్టీల అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో సక్సస్ అయింది. తాజా గెలుపుతో జార్ఖండ్‌లో అధికార పక్షానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story