- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీహార్‌లో దారుణం: వివాహితపై సామూహిక అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్‌లో బుల్లెట్!
బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో మానవత్వం మంటగలిసే ఘోర ఘటన వెలుగుచూసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో మానవత్వం మంటగలిసే ఘోర ఘటన వెలుగుచూసింది. జూన్ 11న అర్ధరాత్రి వేళ చకియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు దుండగులు ఒక ఇంట్లోకి చొరబడి, భర్తను ఒక గదిలో బంధించారు. అనంతరం సదరు వివాహితను ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడానికి ప్రయత్నించడంతో, నిందితులు బ్లేడ్‌తో ఆమె ఛాతి, తొడలపై విచక్షణారహితంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే ఆమె స్పృహ కోల్పోయినట్లు సమాచారం.
ప్రైవేట్ భాగాల్లో బుల్లెట్, రాయి
ఘటన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి, గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు సదర్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. నిందితుల క్రూరత్వానికి పరాకాష్టగా ఆమె ప్రైవేట్ భాగాల నుండి ఒక లైవ్ బుల్లెట్, ఒక రాయి, అలాగే ఒక చెక్క ముక్కను వైద్యులు వెలికితీశారు. మూడు నెలల క్రితం కూడా ముగ్గురు దుండగులు తమ ఇంట్లోకి చొరబడి దాడి చేసి, నగదు, నగలు దోచుకెళ్లారని.. అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు.
దర్యాప్తు వేగవంతం: డీఎస్పీ
ఈ అమానుష ఘటనపై డీఎస్పీ ఆనంద్ కుమార్ పాండే స్పందిస్తూ.. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, గతంలో ఈ కేసు విషయంలో పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






