శంకరాచార్యులు ఎలాంటి మఠాలను స్థాపించలేదు : చిన్న జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

చిన్న జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

శంకరాచార్యులు ఎలాంటి మఠాలను స్థాపించలేదు : చిన్న జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : చిన్న జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆది శంకరాచార్యులు చతురాంనాయ పీఠాలను (నాలుగు అమనాయ పీఠాలు – శృంగేరి, ద్వారకా, పూరి, జ్యోతిర్మఠ) స్థాపించలేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. 32 ఏళ్ల వయసులో శంకరాచార్యులు ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయారని, ఆయన తిరిగి వచ్చి మఠాలను స్థాపించినట్టు చరిత్రలో ఎక్కడా లేదని అన్నారు. 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులు హరిహరరాయులు, బుక్కరాయుల గురువు విద్యారణ్య స్వామి స్థాపించారని పేర్కొన్నారు.

అయితే భారతదేశంలో అత్యధిక మంది నమ్మే సాంప్రదాయ ప్రకారం.. ఆది శంకరాచార్యులు (క్రీ.శ. 8వ శతాబ్దం) అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేయడానికి ఈ నాలుగు మఠాలను స్థాపించారు. దేశం నలుమూలలలో మఠాలు ఏర్పాటు చేసి, హిందూ ధర్మంలో ఐక్యత తీసుకురావడమే ఆయన లక్ష్యం అని చెబుతారు. ప్రతి మఠానికి ఒక ప్రధాన శిష్యుడిని నియమించి, వేదాలు, ఉపనిషత్తులు, అద్వైత సిద్ధాంతాన్ని బోధించే బాధ్యత అప్పగించారని దశనామి సన్యాస సంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ నాలుగు మఠాలు శంకరాచార్యుల వారసత్వానికి చిహ్నాలుగా భావిస్తారు.

ఇపుడు వివాదానికి కారణం అయిన చిన్న జీయర్ స్వామి విశిష్టాద్వైత సంప్రదాయానికి చెందినవార. రామానుజాచార్య పరంపరను అనుసరిస్తారు. విశిష్టాద్వైతం, అద్వైతం మధ్య తాత్విక భేదాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఈ రెండు సంప్రదాయాల మధ్య సిద్ధాంతపరమైన వాదనలు జరిగాయి. అందుకే అద్వైత వాదులు, శంకరాచార్య పీఠాల అనుచరులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఆధునిక పరిశోధనలు, చరిత్రకారుల వాదనలు వేరుగా ఉన్నప్పటికీ.. నాలుగు అమ్నాయ పీఠాలు ఆది శంకరాచార్యులే స్థాపించారు అన్నదే అత్యధికమంది చేత అంగీకరించబడిన విషయం. ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు ఉన్నా, ఆది శంకరాచార్యుల పాత్రను తక్కువగా చూపించడం సరైంది కాదని చాలామంది ఆధ్యాత్మిక గురువులు, పండితులు అభిప్రాయపడుతున్నారు. అందుకే చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదంగా మారాయి.

Next Story