- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: గుండెపోటుతో సీనియర్ ఫొటో జర్నలిస్టు హఠాన్మరణం
సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం.విద్యాసాగర్ (63) హఠాన్మరణం చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం.విద్యాసాగర్ (63) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అప్పటికే విద్యాసాగర్ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. విద్యా సాగర్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. విద్యాసాగర్ నమస్తే తెలంగాణ పత్రికలో సీనియర్ ఫొటోజర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయ్యారు. గతంలో ఉషోదయం, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఏపీ టైమ్స్, హిందీ మిలాప్, వార్త పత్రికల్లో పని చేశారు.
విద్యాసాగర్ మరణవార్త తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఫొటోజర్నలిస్టుల సంఘం అధ్యక్షులు ఏ.గంగాధర్, ప్రధాన కార్యదర్శి కే.ఎన్.హరి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి సంతాపం తెలిపారు. విద్యాసాగర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యాసాగర్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫొటోజర్నలిస్టుల సంఘం నాయకులు కే.అనిల్ కుమార్, నక్కా శ్రీనివాసులు, రజినీకాంత్, శ్రీనివాస్, నోహ సీలం, గాంధీ, జాన్, సుధీర్ తదితరులు సంతాపాన్ని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






