Jagati Babu: ఒళ్లు బలిసి ఈ వీడియో పెట్టాను.. మరోసారి షాకింగ్ పోస్ట్ పెట్టిన సీనియర్ హీరో

by sudharani |

ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు (Jagapathi Babu).. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ (Special Craze) తెచ్చుకున్నాడు.

Jagati Babu: ఒళ్లు బలిసి ఈ వీడియో పెట్టాను.. మరోసారి షాకింగ్ పోస్ట్ పెట్టిన సీనియర్ హీరో
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు (Jagapathi Babu).. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ (Special Craze) తెచ్చుకున్నాడు. అలాగే.. ఫ్యామిలీ హీరోగా ప్రతి ఇంటిలో కలిసిపోయాడు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings)లోనూ తన సత్తా చాటుకుంటూ విలన్ (villain)గా నటిస్తున్నాడు. ప్రజెంట్ (present) వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఈయన.. భాషతో సంబంధం లేకుండా తెలుగు (Telugu), తమిళం (Tamil), హిందీ (Hindi)లో నటిస్తూ సందడి చేస్తున్నాడు.

ఇక సినిమా విషయాలు పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియా (Social Media)లో యాక్టీవ్ (active)గా ఉంటాడు జగ్గుబాయ్. అలాగే తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ (Updates)తో పాటు పర్సనల్ (personal) విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటాడు. అలాగే.. ఎప్పటికప్పుడు వెరైటీ ఫొటో షూట్‌లతో, వీడియోలతో సందడి చేస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. ‘కొంచెం స్టైల్ కొడదాం అని ఓవర్ యాక్షన్ చేశా. బాగుంది అని చెప్పండి హ్యాపీగా ఫీల్ అయిపోతా’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. అయితే.. ఈ వీడియో బాగుందని నెటిజన్లు చెప్పడంతో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు జగ్గుబాబు. ఆ వీడియోలో కూడా స్టైలిష్‌గా కనిపించిన జగపతి బాబు.. ‘బాగున్న అని చెప్పారు కాబట్టి హ్యాపీ అయిపోయి.. ఒల్లు బలిసి ఈ వీడియో పెట్టాను’ అనే ఓ క్యాప్షన్ ఇచ్చాడు.

Next Story