- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు త్వరగా తల్లిని కావాలని ఉంది.. సెలీనా
by Chukka Sudharani |
దిశ, సినిమా : ప్రముఖ అమెరికన్ సింగర్ సెలీనా గోమెజ్ త్వరగా తల్లిని కావాలని కోరుకుంటోంది.

X
దిశ, సినిమా : ప్రముఖ అమెరికన్ సింగర్ సెలీనా గోమెజ్ త్వరగా తల్లిని కావాలని కోరుకుంటోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న 30 ఏళ్ల బ్యూటీ.. లైఫ్, కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను వీలైనంత తొందరగా వివాహం చేసుకుని తల్లిని కావాలని ఆశిస్తున్నా. రాబోయే కాలాన్ని ముందుగానే ఊహించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇప్పటికే ఎన్నో సంఘటనలతో విసిగిపోయా. కాబట్టి నా శ్వాస శాంతించకముందే నా జీవితంలో ఎక్కువ భాగాన్ని తల్లి పాత్రకే అంకితం చేయబోతున్నా. ఓ చిన్న పాపను గొప్ప మనిషిగా తీర్చిదిద్దడం కన్నా మించిన అనుభూతి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నా పేరెంట్స్ వలె నా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. ఇదే నిజం' అంటూ ఎమోషనల్ అయింది. ఇక ఈ గుడ్ న్యూస్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్ 'ఆ అదృష్టవంతుడెవరో చెప్పేయ్' అంటూ హ్యాపిగా ఫీల్ అవుతున్నారు.
Next Story






