- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత : ముగ్గురి పై కేసు నమోదు
by Batti.Sumithra |
బచ్చన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం కొలనుపాక శివారు వాగు నుండి బొందుగుల గ్రామానికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.

X
దిశ, బచ్చన్నపేట : మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బచ్చన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం కొలనుపాక శివారు వాగు నుండి బొందుగుల గ్రామానికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో నారాయణపురం గ్రామం వద్ద పోలీసులు నిఘా ఉంచారు. ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లతో పాటు వాటికి ఎస్కార్ట్‌గా వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్‌ను పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పై కొలనుపాక గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని, ఇద్దరు డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలు, రవాణా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన మండల ప్రజలను కోరారు.
Next Story






