ఫలాలు అన్ని కేసీఆర్ కుటుంబానికే: ఎమ్మెల్యే సీతక్క

by Disha Web Desk 12 |
ఫలాలు అన్ని కేసీఆర్ కుటుంబానికే: ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, ముషీరాబాద్: ఫలాలు అన్ని కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. గొంతు పెంచాల్సిందే, ప్రశ్నించాల్సిందే, ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సిదేనని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. ఆత్మహత్యలు, పని భారం, అప్పులు తెలంగాణ సమాజం మీద పెట్టారని, రాష్ట్రంలో ఉద్యోగ భద్రత లేదని దుయ్యబట్టారు. విఆర్ఎ, ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు.

అన్యాయాన్ని ఎదిరిస్తే నిరంకుశంగా తొక్కిపెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉద్యోగులు ఆత్మహత్య లు చేసుకోలేదని, ఉద్యోగులను బదిలీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులను ఆత్మహత్య చేసుకునే విధంగా చేయడంలో కేసీఆర్ దేశానికే ఆదర్శం అని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చ లేదన్నారు. అలాగే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 300 మందికి పైగా ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను తొలగించారని.. వారందరినీ తిరిగి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతయ్య, నీలం వెంకటేష్, జిల్లపల్లి అంజి, అసోసియేషన్ అధ్యక్షులు అనసూయ, షేక్ ఇమామ్ పల్లి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed