మనీ లాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ

by Disha Web Desk 17 |
మనీ లాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ
X

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్ మెంట్ ప్రశ్నించింది. రుణాలు, పెట్టుబడుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో జె అండ్ కె బ్యాంక్ మాజీ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ షేక్, అబ్దుల్లాతో పాటు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. ఓ ఆస్తి కొనుగోలులో ఎక్కువ మొత్తం డబ్బు చూపినట్లు కేసులో పేర్కొంది. విచారణ అనంతరం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. 'ప్రస్తుతం విచారణ జరుగుతుంది. 12-13 ఏళ్ల కిందటి కేసు ఇది. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చాను. భవిష్యత్తులోనూ వారికి సహకరిస్తాను' అని అన్నారు. అనంతరం జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కేంద్రం పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేసింది. రాజకీయాల కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తుందని ఆరోపించింది. దేశంలో ఎన్నికలను దర్యాప్తు సంస్థలే ప్రకటిస్తున్నాయని విమర్శించింది. ఇలాంటి చర్యలు బీజేపీకి ఎటువంటి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వవని పేర్కొంది. సరైన సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు ప్రజలు మంచి మద్దతు ఇస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది.


Next Story

Most Viewed