టీ20 ప్రపంచకప్ వేళ బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అన్నంత పనిచేసిన ఐసీసీ

by Gantepaka Srikanth |

టీ20 ప్రపంచకప్ వేళ బంగ్లాదేశ్‌ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) భారీ షాక్ ఇచ్చింది.

టీ20 ప్రపంచకప్ వేళ బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అన్నంత పనిచేసిన ఐసీసీ
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) వేళ బంగ్లాదేశ్‌ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. భారత్‌లో మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడంతో పాటు టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు కూడా ప్రకటించింది. బంగ్లా డిమాండ్స్ ఆమోదయోగ్యమైనవే అని పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేయడంతో షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వడం మొత్తం క్రికెట్ లోకాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆటగాళ్ళు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో, లిటన్ దాస్ వంటి సీనియర్ ఆటగాళ్ళు టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపినా, ప్రభుత్వ నిర్ణయంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ బహిష్కరణ కారణంగా బంగ్లాదేశ్ బోర్డుకు, ఆటగాళ్లకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లనుంది. ప్రపంచ వేదికపై తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోవడం, భవిష్యత్తులో ఐసీసీతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉండటం ఆటగాళ్లను కలవరపెడుతోంది. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని ఆసక్తి నెలకొంది.

Next Story