- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో ఆధార్ స్పెషల్ క్యాంపులు – షెడ్యూల్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం (State Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి నెలలో రెండు విడతలుగా ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు, రెండో విడత ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. స్థానిక 'స్వర్ణ గ్రామం/వార్డు' (సచివాలయ) సిబ్బంది ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరాల్లో 5 నుంచి 17 ఏళ్ల లోపు విద్యార్థులు తమ బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
పిల్లల వయస్సు పెరిగే కొద్దీ వేలిముద్రలు, కంటిపాప (Iris) గుర్తులు మారడం వల్ల భవిష్యత్తులో స్కాలర్‌షిప్‌లు, పరీక్షల రిజిస్ట్రేషన్ల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ సువర్ణావకాశాన్ని కల్పించింది. బయోమెట్రిక్ అప్‌డేట్‌తో పాటు పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి ఇతర మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆధార్ వివరాలను సరిచేసుకోవాలి అధికారులు సూచిస్తున్నారు.






