- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఎస్సీ కమిషన్ ఆగ్రహం
మమతా బెనర్జీ ఎస్సీలను కించపరిచారనే ఆరోపణలపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్! బెంగాల్ సీఎస్, డీజీపీలకు లేఖ రాసిన డైరెక్టర్ సోనాలి దత్తా.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఎంసీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎస్సీ సామాజిక వర్గం (SC community)పై అనుచిత పదజాలం ఉపయోగించారు. ఆమె వాడిన పదజాలానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో స్పందించిన జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ కమిషన్ డైరెక్టర్ సోనాలి దత్తా, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) మరియు రాష్ట్ర డీజీపీ (DGP)లకు అధికారికంగా లేఖ రాశారు. ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎస్సీ వర్గాలను కించపరిచేలా మాట్లాడారని కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి.
ఈ వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరిపి, వాస్తవాలను కమిషన్ ముందు ఉంచాలని లేఖలో కోరారు. ఎస్సీ సామాజిక వర్గం గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ఈ వ్యవహారంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటంపై కమిషన్ సీరియస్ అయింది. ఈ లేఖపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎలాంటి వివరణ ఇస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సందేశ్‌ఖాలీ వంటి ఘటనలతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కి ఉండగా, తాజా వివాదం అధికార టీఎంసీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది.






